ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా రివ్యూ

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులు, విద్య మరియు వైద్యం వంటి అంశాలపై రివ్యూ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ మంత్రులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నియోజకవర్గాల శాసనసభ్యులు మరియు ముఖ్యనాయకులు.

అందులో భాగంగా నేడు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సమావేశంలో వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మేఘా రెడ్డి గారు మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు సమస్యల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడికక్కడే పలు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.