ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అధ్యక్షతనలో నిర్వహించిన రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్రమం

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అధ్యక్షతనలో నిర్వహించిన రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్రమంకు విచ్చేసిన సబ్ కమిటీ సభ్యులు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జూపల్లి కృష్ణా రావు, ఎంపీ మల్లు రవి గారు,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ…

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంను ప్రజా అభిప్రాయాలు, సూచన మేరకు పకడ్బందీగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు భరోసా తో పాటు పంట బీమా ను కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ

ప్రజలు పన్ను రూపకంగా ప్రభుత్వ ఖజానా కు చేరిన ప్రతి రూపాయిని మళ్ళీ ప్రజలకు, రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇచ్చిన సలహాలను,సూచనలతో రైతు భరోసా అమలుచ్చేస్తామన్నారు.

ఉమ్మడి మహబూబ్ జిల్లా పరిధిలోని 250 రైతుల తమ అభిప్రాయాలను కమిటీ ముందు వ్యక్తం చేశారు..

➨.కష్టపడి పంట పండించే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి. తప్ప వందల ఎకరాలు ఉన్నవారికి రైతు భరోసా అమలు చెయ్యొద్దు అన్ని.

➨.5 ఎకరాలిలోపు ఉన్న వారికి రైతు భరోసా అమలు చేయాలని.

➨.కౌలు రైతులకు సైతం రైతు భరోసా ఇవ్వాలని అదే సమయంలో రైతుకు సైతం ఇవ్వాలన్నారు.

➨.పంటను సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా కల్పించాలని.

➨.నిరుపేద రైతులకే రైతుభరోసా కల్పించాలని. అధిక భూమి ఉన్న రైతులకు రైతుబంధు అవసరం లేదు.

అనంతరం రైతుల అభిప్రాయాలను మండలాల వారీగా, జిల్లాల వారీగా అడిగి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.

రాబోవు అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు..