రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ విడుదల కార్యక్రమానికి హాజరై కార్యక్రమంలో పాల్గొన వనపర్తి ఎమ్మెల్యే మేఘరెడ్డి.
రేవల్లి మండలం చెన్నారం గ్రామం రైతువేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి విచ్చేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారికి డప్పు వైద్యాలతో, గ్రామస్తులు,రైతులు నృత్యం చేస్తూ ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది.
అనంతరం ఎమ్మెల్యే గారు రైతులతో కలిసి రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలను, దృశ్యాలను వీక్షించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా నాయకులు, మండల,గ్రామ కాంగ్రెస్ నాయకులు,అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.