పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గారు సందర్శించి పరిశీలించారు.
పెబ్బేరు మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల అభివృద్ధికి అ పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నతంగా స్థిరపడిన ప్రతి పూర్వ విద్యార్థి స్పందించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే గారు తనవంతుగా రూ.2లక్షల ఆర్థిక సాయం ప్రకటించిచారు. అలాగే అదే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి వల్లపు రెడ్డి , ప్రకాష్ రెడ్డి వారికి పాఠశాలకు లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది.
వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు విద్యార్థులు వారు చదువుకున్న పాఠశాలకు వారికి తోచిన సహాయం చెయ్యాలని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
శిథిలావస్థకు చేరిన పాఠశాలను పటిష్టపరిచేందుకు పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి అదనపు గదుల నిర్మాణాలకు తమ వంతు ఆర్థిక సహాయం అందించీ పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.