ఎమ్మెల్యే గారి సొంత నిధులతో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని నవాబ్ పేట్ మండలంలోని యన్మన్ గండ్ల జూనియర్ కళాశాలలో ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారు…
జడ్చర్ల నియోజకవర్గం విద్యా, వైద్య రంగాలలో ముందంజలో ఉండాలని నా సంకల్పం… నియోజకవర్గంలోని ఐదు కళాశాలలో 1300 మంది విద్యార్థులకు సౌకర్యం…
మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేసిన కళాశాల యజమాన్యం, విద్యార్థులు…
జడ్చర్ల నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కుటుంబ పరిస్థితులు ,ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక మరియు కళాశాలకు సక్రమంగా హాజరు కావడం లేదు.ఇట్టి విషయాన్ని గుర్తించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు నియోజకవర్గంలోని ఐదు కాలేజీల్లో చదువుతున్న సుమారు 1300 మంది విద్యార్థుల ఆకలి తీర్చడం కొరకు నేడు నవాబ్ పేట్ మండలంలోని యన్మన్ గండ్ల జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే గారి సొంత నిధులతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
కళాశాలలో మౌఖిక వసతులకు సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు…
కళాశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యాభ్యాసాన్ని సక్రమంగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు…
నా రాజకీయ గురువు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు చేప్పినారు జడ్చర్ల నియోజకవర్గం విద్య, వైద్యం లో రంగాలలో ముందంజలో ఉంచాలని అన్నారు…
అయనను ఆదర్శంగా తీసుకుని ఈ మధ్యాహ్న బోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నమన్నారు….
మన జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎక్కువ శాతం ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత స్థాయి రంగాల్లో విద్యార్థులు ఉండాలనేదే నా యొక్క ఆకాంక్షాన్ని తెలిపారు.కళాశాలమధ్యాహ్నం భోజనం కార్యక్రమం పట్ల కళాశాల యజమాన్యం, విద్యార్థులు వర్షం వ్యక్తం చేశారు…
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కళాశాల యజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు…
#Navabpet
