ప్రతి ఎకరాకు నీరందిస్తాం.

మరమ్మత్తులు పూర్తి చేస్తూ ప్రతి ఎకరాకు నీరందిస్తాం.

నాగర్ కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ కల్వకుర్తి ఎస్ఐఎస్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ నుండి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కాలువల మరమ్మతులు చేపడతామని ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు అన్నారు బుధవారం గుడిపల్లి రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పంపు స్విచ్ లను ప్రారంభించారు ఈ సందర్భంగా కృష్ణమ్మకు పూలు చల్లుతూ మంగళ హారతులతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు సాగునీటిపారుదల శాఖ అధికారులు నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.