రాజా గారి బంగ్లా కాపడుకుంటాం

ఎన్ని ఇబ్బందులు వచిన్న రాజా గారి బంగ్లా కాపడుకుంటాం MLA మేఘా రెడ్డి..

ఎమ్మెల్యే గారు, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి వనపర్తి జిల్లా లోని రాజభవనాన్ని సందర్శించి పరిశీలించారు.

వనపర్తి జిల్లాకే తల మాణికంగా ఉండే (రాజా గారి బంగ్లా) పాలిటెక్నిక్ కళాశాలలో ముందస్తు ఆలోచన, అవగాహన లేకుండా ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు నేడు రాజమహల్ కి ఇబ్బందిగా మారాయని, వాటి నిర్మాణంతో వర్షపు నీరు పూర్తిగా రాజమహల్ లోకి చేరి రాజమహల్ కి ముప్పు వాటిల్లేల ఉందని, గొప్ప చరిత్ర కలిగిన రాజమహల్ కి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాపాడుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ మేఘా రెడ్డి గారు పేర్కొన్నారు

రాజ భవనంలోకి నీరు రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే నీటిపారుదల శాఖ డ్యామ్ సేఫ్టీ అధికారి వనపర్తి వాస్తవ్యుడైన శ్రీనివాస్ రెడ్డి గారి సహకారం తీసుకోవాలని ఎమ్మెల్యే గారు అధికారులకు సూచించారు

త్వరలోనే రాజమహల్ ని పూర్వపుకల వచ్చేలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు