వనపర్తి జిల్లా కేంద్రంలో కమాన్ చౌరస్తాలో షాక్ సర్క్యూట్ వల్ల కాలిపోయిన కిరాణం షాపును పరిశీలించిన ఎమ్మెల్యే గౌరవ తూడి మేఘా రెడ్డి.
వనపర్తి పట్టణంలోని కమాన్ చౌరస్తాలో శ్రీ రామ ఆంజనేయ కిరాణం షాప్ షార్ట్ సర్క్యూట్ జరిగి షాప్ లో అన్ని వస్తువులు కాలిపోయాయి ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కాలిపోయిన షాప్ ను పరిశీలించి కిరాణం షాప్ యజమాని కృష్ణ గారిని షార్ట్ సర్క్యూట్ జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
షాప్ లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగిందని యజమాని కృష్ణ గారు ఎమ్మెల్యే గారికి తెలియజేశారు.
ఎమ్మెల్యే గారు కిరాణం షాప్ యజమాని కృష్ణ గారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.