భారీ వర్షంకి కూలిపోయిన ఇంటిని సందర్శించిన పరిశీలించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన జామాలపల్లి పెంటయ్య ఇల్లు కూలిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి.గారు జడి వానను సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఘటన స్థలానికి వెళ్లి బాధిత కోటుంబానికి నేనున్నానని భరోసా కలిపించి తక్షణ అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని వారికి అందించడం జరిగింది అలాగే ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కచ్చితంగా వారికి మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

అలాగే మున్సిపాలిటి అధికారులకు శితిలావస్థ వున్న మిగతా గృహలను పరిశీలించి వారిని అప్రమత్తం చేయాలనీ ఆదేశించారు.