దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి తండ్రి మృతి చాలా బాధాకరం.
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి తండ్రి ఈనెల 5వ తేదీన స్వర్గస్తులయ్యారు.
ఆ సమయంలో స్థానికంగా అక్కడ లేకపోవడంతో సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే గారి సొంత గ్రామం చిన్న చింతకుంట మండలం దమగ్నాపురంలోని వారి నివాసంలో ఆయనను కలిసి పరామర్శించరు
ఈ సందర్భంగా స్వర్గస్తులైన దేవరకద్ర ఎమ్మెల్యే గారి తండ్రి కృష్ణారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
కార్యక్రమంలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఖిల్లా గణపురం మండల సింగిల్ విండో డైరెక్టర్, యువ నాయకులు సాయి చరణ్ రెడ్డి,వనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త లక్కాకుల సతీష్, శ్రీరంగాపురం మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు, వహీద్ తదితరులు పాల్గొన్నారు
