పెద్దమందడి మండల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

పెద్దమందడి మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరై 22 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని పాఠశాల విద్యార్థులకు డ్రస్సులు తయారు చేయడం ఆర్టీసీ బస్సుల కొనుగోలులో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించారని వారికి తెలియజేశాను.

అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను గుర్తించి వారికి 16500 రూపాయలను అందజేస్తుందనీ ఇండ్లు దెబ్బతిన్న బాధితులు వారి వివరాలను తహసిల్దార్ కార్యాలయంలో ఇవ్వాలని అందరికీ చెప్పడం జరిగింది.

అలాగే 36 కోట్ల రూపాయలతో పెద్దమందడి రోడ్డుకు త్వరలోనే పనుల ప్రారంభం కనున్నాయి.

కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ తాసిల్దార్ వెంకటేశ్వర్లు ఎంపీడీవో సద్గుణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు