పెబ్బేరు మండల వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం

పెబ్బేరు మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…

పెబ్బేరు మండల వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పెబ్బేరు మండల ప్రజలు,కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలకడం జరిగింది.

పెబ్బేరు మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అధ్యక్ష ,ఉపాధ్యక్షులతో పాటు డైరెక్టర్లు అందరినీ సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది.

పెబ్బేరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తాను ఎల్లవేళలా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మార్కెట్ యార్డ్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు డైరెక్టర్లు అందరూ మార్కెట్ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలి.

అలాగే కబ్జాకు గురైన పెబ్బేరు సంత స్థలానికి కావలదారుడుగా ఉండి 30 ఎకరాల 22 కుంటలకు దగ్గరుండి కంపౌండ్ వాల్ ఏర్పాటు చేయించడం తో పాటు.రైతు భీమా, రైతు భరోసా పథకాలను పక్కాగా అమలు చేసి రైతు శ్రేయస్సు ప్రభుత్వ శ్రేయస్సుగా నిలిపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని తెలియజేయడం జరిగింది.

ఇండ్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు అర్హతలైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు త్వరలోనే అందుతాయని.డిజిటల్ రేషన్ కార్డు తో పాటు ఆరోగ్యశ్రీ కార్డు సైతం ప్రతి ఒక్కరికీ అందజేస్తామని తెలియజేయడం జరిగింది.

అలాగే రైతు రుణమాఫీ పై మాట్లాడి నైతిక హక్కు BRS పార్టీ నాయకులకు లేదు లక్ష రుణమాఫీ చేస్తామని విడతల వారీగా అన్నదాతలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన ఏకైక ప్రభుత్వం BRS ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారికి ఎల్లవేళలా అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది.

పెబ్బేర్ పట్టణంలోని ప్రతి వార్డును అన్ని విధాల బాగు చేస్తామని అభివృద్ధి చేసేందుకు తను వెళ్లవెల్ల కృషి చేస్తానని పెబ్బేరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎల్లవేళలా ఆదరించాలని కోరుకుంటున్నాను.

కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు