భగీరథ నీరే సురక్షితమైనది

మంచినీటి సహాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలి..

వనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ మంచినీటి సహాయకుల నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి హాజరు కావడం జరిగింది.

సందర్భంగా మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే తాగునీరు ఎంతో ఆరోగ్య దయకమని మిషన్ భగీరథ నీరు తాగడం వలన మనందరం ఆరోగ్యంగా ఉంటామని

గ్రామాలలో ప్రజలతో మమేకమై ఉండే చిన్న ఉద్యోగస్తులైన సహాయకులపైనే పని భారం ఎక్కువగా ఉంటుందని ఎక్కడ కూడా అసహనానికి గురవకుండా ప్రజల సమస్యల నివృత్తి చేస్తూ రక్షిత మంచినీటిని అందజేయాలని పేర్కొనడం జరిగింది.

ఈ సందర్భంగా నాలుగు రోజుల శిక్షణలో పాల్గొన్న గ్రామం మంచినీటి సహాయకులకు ప్రశంసా పత్రాలను.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీల అమలులో గల మహాలక్ష్మి పథకంలోని రాయితీ సిలిండర్లకు సంబంధించిన పత్రాలను మహిళలకు అందజేయడం జరిగింది.