ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

బల్మూరు మండల కేంద్రంలో మండల స్వయం సహాయక బృందాలు ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కాంటీన్ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని క్యాంటీన్ ప్రారంభించారు.

ప్రభుత్వం మహిళా సాధికారత మహిళలందరినీ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఇందిరా మహిళా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది.వీటి ద్వారా మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి వారి స్వశక్తి మీద ప్రభుత్వం అందించే రుణాలను తీసుకొని ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ ఏర్పరచుకొని ఆర్థికంగా అన్ని రంగాల అభివృద్ధి చెందాలని ప్రభుత్వం యొక్క లక్ష్యం.

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు,మహిళలు స్వయం సహాయక సంఘాల పాల్గొన్నారు.