ఊర్కొండ: మండలంలోని బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు జెట్టి హరికృష్ణ భార్య జెట్టి మమత అనారోగ్యంతో మృతి చెందారు.
కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాధారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి మృతదేహానికి నివాళ్ళు అర్పించారు. జెట్టి హరికృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.
వారి వెంట యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంఠం విజయుడు, నాయకులు రాఘవేంద్ర, ఆదినారాయణ, నాగరాజు తదితరులు ఉన్నారు