
అచ్చంపేట నియోజకవర్గంలో చరగొండా మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అదనపు గదుల నిర్మాణం కొరకై శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం విద్య సంక్షేమం కొరకై అధిక నిధులు కేటాయిస్తూ పాఠశాలల బలోపేతం మీ లక్ష్యంగా విద్యార్థులకు కావలసినటువంటి అన్ని రకాల వసతులు సమకూరుస్తుందని గత కొద్ది రోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు డైట్ మిర్చార్జీలు పెంచడం జరిగింది.
విద్యార్థులు అందరూ కూడా కష్టపడి చదువుతూ ప్రతి ఒక్కరు ఉన్నత లక్షలకు చేరుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించడం జరిగింది కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.