CVK అచ్చంపేట ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.

అచ్చంపేట పట్టణంలో గత వారం రోజుల నుండి కొనసాగుతున్న CVK అచ్చంపేట ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో గెలుపొందిన విన్నర్స్ రన్నర్స్ మొదటి బహుమతి ప్రైజ్. వెంకట్ బిల్డర్స్ రెండవ బహుమతి ఆనంద్ గౌడ్ లకు అందజేయడం జరిగింది.

అచ్చంపేట నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క్రీడాకారులను మరింతగా రాణించడానికి తన వంతు ప్రయత్నం చేస్తాను. నల్లమల ప్రాంతంలో క్రీడాకారులకు పుట్టినిల్లు అయినటువంటి ఈ అచ్చంపేట క్రీడాకారులకు అన్ని రకాల సకల సదుపాయాల వసతులతో కూడిన క్రీడా స్థలాలు మినీ స్టేడియాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాం.

అచ్చంపేట పట్టణంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో.కొద్ది రోజుల్లో 10 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం గా రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియంగా మార్చడం జరుగుతుంది. క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది.