నల్లమల్ల ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మారుస్తాం రాష్ట్ర పర్యాటకశాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి.

నల్లమల ప్రాంతంలో శ్రీ ఉమామహేశ్వర దేవాలయం ను సందర్శించి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన.. రాష్ట్ర పర్యాటకశాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ నల్లమల ప్రాంతంలో పర్యాటక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించడం జరిగింది వాటిని టూరిజం హబ్ గా మారుస్తూ నల్లమల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమవంతుగా కృషి చేస్తాను.

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు తో కలిసి నల్లమల ప్రాంతంలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధికై ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా కృషి చేస్తాం కార్యక్రమంలో ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ మాధవరెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్ , దేవస్థానం పాలకమండల సభ్యులు , అర్చకులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.