అభయాంజనేయ స్వామి ఆలయ భూమి పూజలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మరియు సాయి చరణ్ రెడ్డి గారు పాల్గొన్నారు
ఖిల్లా ఘనపురం మండలం సల్కలాపురం గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి గారు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే గారితో భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా గౌరారం – మంగనూరు రోడ్ల నిర్మాణం చేపడతామని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు రైతు భరోసా పథకం ద్వారా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మురళీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు విజయ్ కుమార్, వెంకట్రావు, రాములు నాయక్, శ్యాం సుందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు దుర్గయ్య, రవీందర్ రెడ్డి, బాలరాజు యాదవ్, బాధ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.