అచ్చంపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సమగ్ర శిక్ష ఉద్యోగులు కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేసిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు. ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలపై ఆలోచించి ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్తానని అన్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు తాము దీర్ఘకాలికంగా సమగ్ర శిక్షలో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, తమకు వేతనాలు పెంచడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని, బీ మా, ఇతర బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్యోగుల సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.