ఖిల్లా ఘణపురం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి గారు గౌరవ MLA తూడి మేఘా రెడ్డి @megha_reddy_official గారిని రహదారి నిర్మాణానికి అభ్యర్థించారు. ప్రజల అవసరాన్ని గుర్తించిన మేఘా రెడ్డి గారు వెంటనే స్పందించి, సల్కెలాపురం – గౌరారం మార్గానికి రూ. 2.25 కోట్లు మంజూరు చేసి BT రోడ్డు నిర్మాణానికి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో MLA తూడి మేఘా రెడ్డి గారు
, MLA డాక్టర్ రాజేష్ రెడ్డి గారు @kuchakullarajesh యువ నాయకుడు సాయి చరణ్ రెడ్డి గారు పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణంతో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, వాణిజ్య, సామాజిక కార్యకలాపాలకు మరింత మద్దతుగా నిలుస్తుందని ఎమ్మెల్యేలు తెలిపారు.
సల్కెలాపురం-గౌరారం మార్గం కీలకమైనదిగా భావించి, దీని అభివృద్ధికి కృషి చేసిన MLA మేఘా రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని అభివృద్ధి పనులకు మద్దతు తెలిపారు.
