ఠాకూర్ తండాలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించారు

అన్న మీరు మా అభిమాన నాయకులు

ఊర్కొండ:
మాధారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి DNR అన్నగారు మీరు మా అభిమాన నాయకులని కాంగ్రెస్ సీనియర్ నాయకులు లచ్చిరాం నాయక్ అన్నారు. మండలంలోని ఊర్కొండపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఠాకూర్ తండాలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నిఖిల్ అన్న పుట్టినరోజు సందర్భంగా తన స్వంత నిధులతో హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. నిస్వార్థంగా తన స్వంత నిధులతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నా నిఖిల్ అన్నను చూస్తుంటే ఇలాంటి నాయకుడు నేటి సమాజానికి అవసరమని, భవిష్యత్తులో మా గ్రామానికి మరింతా తోడ్పాటును ఇవ్వాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమి, కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుంజ ఆదినారాయణ, NSUI మండల అధ్యక్షుడు కైసర్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి మాసుం నాయకులు మనోహర్ రెడ్డి, వహీద్, దార రాజు, కంఠం రాములు, రఫీఖ్, తండా నాయకులు లాయర్ సత్యనారాయణ, బాలు, దేవేందర్, తిరుపతి, తదితరులు ఉన్నారు.