ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి . సహాయక చర్యలను సీఎంకు వివరించిన రెస్క్యూ టీమ్ అధికారులు – అన్నివిభాగాల సమన్వయంతో పని చేయాలని సూచన – అనంతరం మంత్రులు @uttamkumarreddy_ , @jupally_krishnarao , ఎంపీ @dr.mallu.ravi మరియు MLA @balunaikofficial సంపత్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే @dr_vamshikrishna_inc గారితో కలిసి మీడియాతో మాట్లాడుతున్న. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanthofficial గారు.

ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక పనులను మంత్రులు, ఎమ్మెల్యేల బృందంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రక్షణ చర్యలకు సంబంధించి బృందాలను సీఎం ఆరా తీశారు. సహాయక చర్యలను సీఎంకు రెస్క్యూ టీమ్ అధికారులు వివరించారు. కాసేపు సొరంగ మార్గంలో పనులను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బయటకు వచ్చి సంబంధిత అధికారులతో సమావేశం అయ్యారు. సొరంగంలో చేపట్టిన సహాయక చర్యలకు సంబంధించి సీఎం, మంత్రులకు వివరించారు గత ప్రభుత్వంపై ఆరోపణలు.
ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనే ఉద్దేశంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో మనుషులు, మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను 2005-2006లో ప్రారంభించారని, 2014 తెలంగాణ ఏర్పడే నాటికి 32 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయిందని గుర్తు చేశారు. కానీ, గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదని ఆరోపించారు.ఈ పనులు చేస్తున్న సంస్థ విద్యుత్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారని, దీంతో గత పది సంవత్సరాలు టన్నెల్ పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయని అన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతానికి కృష్ణా జలాలు అందించాలని నిర్ణయించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలని, ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించామని అన్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌కు కావాల్సిన విడి భాగాలను అమెరికా నుంచి తెప్పించి పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకున్నామని కానీ, అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.