డోలారోహణ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి. సాయి చరణ్ రెడ్డి గారు

మామిడి మాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాజా మియా గారి మనుమడి డోలారోహణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి. సాయి చరణ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, బాలుడికి ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మమేకమై, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి. వెంకటేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ మోహన్ జీ గారు, గ్రామ పెద్దలు రవి గారు, నాగరాజు గారు, ఏ. తిరుపతయ్య గారు, మండల యువజన కాంగ్రెస్ నాయకులు రఘురామ్ గారు మరియు పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.