పాలమూరులోకి ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్ రిజ ర్వాయర్లో భూములు నీళ్లు కోల్పోయిన నిర్వాసితులకు గత ప్రభుత్వం ఆర్ఎన్ఆర్ లో తీవ్ర అన్యాయం చేసిందని అసెంబ్లీలో జడ్చర్ల ఎమ్మొల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గళమెత్తారు. పోలేపల్లి సేజ్ భూ నిర్వాసి తులకు ఎకరాకు 12లక్షల 50 వేలు ఇచ్చిందని, ఉదండాపూర్ నిర్వాసితులకు రూ.5.5లక్షలు, 6లక్షలు మాత్రమే ఆర్ఎన్ఆర్ లో పరిహారం ఇవ్వ నున్నట్లు పేర్కొన్నారని, ఆ పరిహారం కూడా నేటికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుడికి ప్రాజెక్టు కింద భూమి లేకున్నా మంగా అనే పేరుపై భూమి లేకున్నా రూ.కోటి యాభై లక్షలు జమ అయ్యాయని చెప్పారు. వీరి పేరుతో భూమి లేకున్నా ఖాతాలోకి డబ్బు ఎలా జమ అవుతాయని ప్రశ్నించారు.
#Asseambly