చలో పాలమూరు…

ఉదండాపూర్ ప్రాజెక్టును సందర్శించిన CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు మరియు సహచర పార్లమెంట్ ఎమ్మెల్యేలు…

గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణ స్థితిగతులు ఏవిధంగా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి నేడు జడ్చర్ల నియోజకవర్గంలో జడ్చర్ల మండలంలోనీ ఉదండాపూర్ ప్రాజెక్టును CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి గారు,పార్లమెంట్ ఎమ్మెల్యేలు G. మధుసూదన్ రెడ్డి గారు, విర్లపల్లి శంకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, యెన్నం శ్రీనివాసరెడ్డి గారు, జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు, సందర్శించారు…

CWC ప్రత్యేక ఆహ్వానితులు వంశి రెడ్డి గారు మాట్లాడుతూ…

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేరుమీద వందల కోట్లు దోచుకున్నారని విమర్శించారు.

గత ఎలక్షన్లో ప్రాజెక్ట్ లన్ని 80% పూర్తయి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీరా చూస్తే 30% ప్రాజెక్టులను పూర్తి చేశారని అన్నారు…

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ…

ప్రాజెక్టు నిర్మాణాల్లో అవకతవకాలు చేస్తూ రాష్ట్ర ఖజానాను పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు…

32 వేల కోట్లతో ప్రాజెక్ట్ సంక్షన్ అయ్యింది.మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆంధ్ర కాంట్రాక్ట్ కు రేటు పెంచాడు. కానీ రైతులకు మాత్రం పరిహారం పెంచలేదని అన్నారు.

ప్రాజెక్టు పూర్తి చేయడంలో విఫలమైన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పేరిట వందల కోట్లు సంపాదించుకున్నారని అన్నారు…

మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్ని పూర్తయ్యే దిశగా సహచర పార్లమెంట్ ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేస్తామని అన్నారు…

చలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కార్యక్రమంలో భాగంగా.. దేవరకద్ర నియోజకవర్గంలోని కరివెన రిజర్వాయర్ ని సందర్శించిన CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *