జడ్చర్ల నియోజకవర్గంలోని నూతన విద్యా విధానానికి శుభాకాంక్షలు తెలిపారు…
తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా సొంత నిధులతో జడ్చర్ల నియోజకవర్గంలోని 274 ప్రభుత్వ పాఠశాలలోని 53 వేల పైచిలుకు విద్యార్థులందరికీ షూలు పంపిణీ చేస్తాం. – ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు
మీడియా సమావేశం ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
గత నెలలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని అన్నారు.
పార్లమెంట్ ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 తారీకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా జరుగుతది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తామని తెలిపారని అన్నారు.
అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు నేను పాదయాత్ర చేస్తూ జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ షూలు ఇప్పిస్తానని చెప్పినట్లుగా నేడు నియోజకవర్గంలోని 274 పాఠశాలలోని 53 వేల పైచిలుకు విద్యార్థులందరికీ షూ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
ఆగస్టు చివరి లోగా మా కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను కమిటీలుగా వేసి ఆయా గ్రామాలలో ఉన్న పాఠశాల వెళ్లి విద్యార్థుల సైజులు తీసుకొని విద్యార్థులకు షూలు పంపిణీ చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జడ్చర్ల లోనే మొదటిదని అన్నారు.
ఇంతకు ముందులాగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎలాగైతే విద్యను అభ్యసించేవారు ఆ విధంగానే పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ వారం రోజులలో పాఠశాలలో నా స్నేహితుల సహకారంతో 20 మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
అలాగే 20 టీవీలు కూడా తెప్పించాము. ఎలక్షన్ కోడ్ ఉండడంవల్ల అవి పాఠశాలలో అమర్చలేకపోయాము. తొందర్లోనే ఆ టీవీలను పాఠశాలలో అమర్చి విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఆన్లైన్ క్లాసులు వినడానికి ఉపయోగపడేలా చేస్తామని అన్నారు.
