జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్ లో ఉన్న హెటిరో ల్యాబ్స్ PVT. కంపెనీ ఆధ్వర్యంలో వికలాంగులకు అందిస్తున్న స్కూటీలను నేడు జడ్చర్ల కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు లబ్ధిదారులకు అందజేశారు …
సందర్భంగా ఎమ్మెల్యేగా మాట్లాడుతూ…
వికలాంగులకు స్కూటీలను అందజేసిన హెటిరో యజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
రానున్న రోజుల్లో కంపెనీ CSR కార్యకలాపాల ద్వారా జడ్చర్ల నియోజకవర్గంలోని కొన్ని పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు.
అలాగే మరింత మంది వికలాంగులకు స్కూటీలను అందజేయాలని వారిని కోరారు.
హెటిరో యజమాన్యం సానుకూలంగా స్పందించి ఈ సంవత్సరంలోనే మరిన్ని స్కూటీలను వికలాంగులకు అందిస్తామని అన్నారు. అలాగే CSR కార్యకలాపాల ద్వారా నియోజకవర్గంలో కొన్ని పాఠశాలలను తీసుకొని అభివృద్ధి చేస్తామని తెలిపారు.