అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో రోగుల సౌకర్యం కొరకై చైర్ లను ఏర్పాటు చేసిన.గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి సతీమణి సిబిఎం ట్రస్ట్ చైర్ పర్సన్ డా. అనురాధ గారి ఆధ్వర్యంలో చైర్ లను ఏర్పాటు చేయడమైనది. వాటిని ప్రారంభించిన. MLA డా చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట ఏరియా హాస్పిటల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా ప్రథమ లక్ష్యం నల్లమల్ల ప్రజలకు వైద్యం అందించాలనే సంకల్పంతో గత రెండు సార్లు అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో మెగా సర్జికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది… నల్లమల సుదూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి రోగులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జబ్బులకు ఇక్కడ నయం అయ్యే విధంగా ఉచిత ఆపరేషన్లు చికిత్స మొదలైనవి ఈ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో సమకూర్చడమైనది. అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో మరికొద్ది రోజుల్లోనే వైద్యులను ,పారామెడికల్, స్టాఫ్ నర్స్ సిబ్బంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలగునవి ఏర్పాటు చేయడం జరుగుతుంది.

పేద ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం పనిచేస్తున్నాం నల్లమల ప్రాంతం నుండి ఎవరు కూడా విద్య వైద్యం పరంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతానికి విద్యాపరంగా వైద్యం పరంగా అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చున్నాము .. గత రెండు రోజుల నుండి కొనసాగుతున్న మెగా సర్జికల్ క్యాంపు ఈరోజు మరియు మొన్నటితో కలిపి 150 సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడమైనది… పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒకరికి కూడా విడుదలవారీగా ఈ యొక్క ఉచిత మెగా సర్జికల్ క్యాంపులో శస్త్ర చికిత్సలు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా.
ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోగలరు అచ్చంపేట నియోజకవర్గం కాకుండా ఇతర సుదూర ప్రాంతాల నుండి కూడా రోగులు వస్తున్నారు వారికి కూడా అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో హాస్పిటల్స్ సూపర్డెంట్ డాక్టర్ ప్రభు డాక్టర్ మహేష్ వైద్య సిబ్బంది పారామెడికల్ సిబ్బంది స్టాఫ్ నర్స్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.