CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

ఆదివారం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందించడం జరిగింది.

మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 76 మంది లబ్ధిదారులకు

రూ.14,10000 విలువగల చెక్కులను ఎమ్మెల్యే గారు లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ

ఇంకో నాలుగు ఐదు రోజులలో సాగునీటి సమస్యలను పరిష్కారం అవుతాయని సాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తున్నామని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంగానే పనిచేస్తున్నామని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ మేఘా రెడ్డి గారు పేర్కొన్నారు

నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఆర్టిసి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ఆర్టీసీ బస్సుల విషయమై రవాణా శాఖ మంత్రి గారికి నివేదికలు పంపించి ఉన్నామని మరో 15 రోజుల్లో ప్రతి గ్రామానికి ఆర్టిసి బస్సు ని ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు