వెనుకబడిన వర్గాల సంక్షేమానికి బీజేపీ, బీఆర్ఎస్ చేసిందేమీ లేదని, ఆ రెండు పార్టీలు బీసీలకు ద్రోహం చేశాయని కాంగ్రెస్ ఓబీసీ జిల్లా ఛైర్మన్ వంగ గిరివర్దన్ గౌడ్ ఆరోపించారు. బుధవారం అచ్చంపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడంతో బీసీ ప్రజాప్రతినిధులు ఎంతోమంది వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయారన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణలో, భారతదేశంలో కుల గణనను నిర్వహిస్తామని హామీ ఇచ్చారని, తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత కుల గణన చేపడుతున్నారన్నారు. బీసీ జనాభా ఉన్న తెలంగాణలో బీసీలకు కుల గణన అత్యంత ప్రయోజనకరమన్నారు. బీసీల అభివృద్ధి బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. కుల గణనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఓబీసీలకు కేంద్ర మంత్రిత్వ శాఖ లేదని ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిమాండ్ను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ బీసీల కోసం ఏమీ చేయలేద అన్నారు. అన్ని బీసీ కులాలకు బీసీ ఫెడరేషన్లు ఏర్పాటు చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. రాహుల్గాంధీ ప్రధాని అయితే దేశ వ్యాప్తంగా కులగణన జరుగుతుందని, ఓబీసీలందరూ కాంగ్రెస్కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.