సింగపూర్ లో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు..

కుటుంబ సమేతంగా సింగపూర్ లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు సమాజ ఆధ్వర్యంలో వీరా టెండర్స్ నిర్వహించిన వినాయకుడి పూజ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే సతీమణి శారద రెడ్డి,కుమారులు నవనీత్ రెడ్డి,మనోజ్ కుమార్ రెడ్డిలు సైతం గణపతికి పూజలు చేశారు.

సాంస్కృతి సాంప్రదాయాలు మేళవింపుగా ఉండే భారత సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లిన భారతీయులు ఎంతో ఘనంగా ఇలాంటి పూజలు నిర్వహిస్తున్నారు.

కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుడికి తొలిపూజను నిర్వహించడం…

ఆశీస్సులు పొందడం అనిర్వచనీయ అనుభూతి…

అందరికీ మరొక్కసారి

వినాయక చవితి శుభాకాంక్షలు..

ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో వ్యాపారవేత్త శ్రీకాంత్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మ రెడ్డి శ్రీనివాస్, సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు శ్రీధర్ రెడ్డి, మణికంఠ రెడ్డి, గోకుల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు