సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన నిఖిల్ రెడ్డి

ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన ఐ జంగయ్య భార్య ఐ చిన్న బాలమ్మ నరాల కి సంబంధించిన వ్యాధితో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నది అందుకుగాను అయిన ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన 50 వేల రూపాయల చెక్కును కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాదారం మాజీ సర్పంచ్ నిఖిల్ రెడ్డి గారు బాధితురాలు అయిన బాలమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా బాలమ్మ మాట్లాడుతూ మా నాయకుడు నిఖిల్ రెడ్డి గారి చొరవతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినందుకు ఎప్పుడూ మా పేదల కోసం అండగా నిలబడే నిఖిల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.