వనపర్తి పట్టణంలోని లక్ష్మీ కృష్ణ గార్డెన్ లో నిర్వహించిన SDM లా కాలేజ్ ప్రథమ వార్షికోత్సవం, ప్రెషర్స్ డే కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయాన్ని న్యాయవ్యవస్థను కాపాడడంలో లాయర్ల పాత్ర కీలకంగా ఉంటుందని లాయర్లందరూ ప్రతినిత్యం న్యాయాన్ని కాపాడాలని తెలియజేయడం జరిగింది.
ఎలాంటి హోదాలో ఉన్న వ్యక్తులను సైతం ప్రశ్నించే హక్కు కేవలం న్యాయవాదులకు మాత్రమే ఉంటుందని ఇలాంటి న్యాయవాద విద్యను అభ్యసించే ప్రతి ఒక్క విద్యార్థి న్యాయాన్ని కాపాడాలని
న్యాయవ్యవస్థ చాలా పటిష్టమైనదని సందర్భాలు వేరైనా కాలాతీతమైన న్యాయమే గెలుస్తుందని చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా పరీక్షలలో ఉత్తమ ప్రథమ కనిపించిన మొదటి సంవత్సరం విద్యార్థులకు మెడళ్లను బహుకరించడం జరిగింది
అదేవిధంగా మొదటి సంవత్సరం విద్యాభ్యాసం కోసం కాలేజీలో చేరిన విద్యార్థులందరికీ గుర్తింపు కార్డులను అందించడం జరిగింది.
కార్యక్రమంలో ప్రిన్సిపల్ భాస్కర్, కళాశాల ఎగ్జిక్యూటివ్ నెంబర్ అనంతరాజు, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ ప్రముఖ వైద్యుడు పగిడాల శ్రీనివాస్, పొల్కేపహాడ్ గ్రామ మాజీ సర్పంచ్ సత్యశీల రెడ్డి కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.