ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాదీప్ రెడ్డి

తాండ్ర ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ. 5 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మంగళవారం పాఠశాల ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాదీప్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటా నికి క్షీరాభిషేకం చేశారు. సీఎం చిన్నతనంలో చదువుకొన్న పాఠశాల అభ్యున్న తికి నిధులు మంజూరు చేసి మా పిల్లల చదువులకు అండగా నిల చారని గ్రామస్థులు పేర్కొన్నారు. సీఎంకు రుణపడి ఉంటామని తల్లి దండ్రులు పేర్కొన్నారు. నాయ కులు సింహరెడ్డి, అశోక్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు