డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఖిల్లా ఘనపూర్ మండలంలోని సూర్యపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి గారు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి. సాయి చరణ్ రెడ్డి గారు శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ప్రజల అభిమానం మరియు సమాజ సేవ పట్ల తమ బాధ్యతగా భావించిన టి. సాయి చరణ్ రెడ్డి గారు తన సొంత ఖర్చుతో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని స్పాన్సర్ చేయడం విశేషం. ఆయన ఈ కార్యక్రమంలో పూలమాల వేసి, డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్భంగా ఖిల్లా ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడు విజయకుమార్ గారు, సొలిపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రవీందర్ రెడ్డి గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి గారు పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.