
అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అచ్చంపేట నియోజకవర్గo వివిధ మండలాల కు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
కళ్యాణ లక్ష్మి చెక్కులు 150 షాదీ ముబారక్, 125 సీఎం రిలీఫ్ ఫండ్ 200 వరకు చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేయడం జరిగింది.ముఖ్యంగా వ్యవసాయాన్ని పండుగ చేయ డానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగా రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంటల బీమా పథకాలతో రైతన్నలను ఆదుకుంటు రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇవ్వడం జరిగింది.