అచ్చంపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

నియోజకవర్గంలో 241 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు మరియు 100 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించి లబ్ధిదారులకు వీలైనంత త్వరలోనే అందించడం జరుగుతుంది.