అచ్చంపేట మండలం చంద్రసాగర్ రిజర్వాయర్ నుండి రబీ సీజన్ పంటకు అవసరమయ్యే సాగునీటిని విడుదల చేయడం జరిగింది. చంద్ర సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు 1200 ఎకరాల ఆయకట్టు మరొక 300 ఎకరాల ఆయకట్టు పెరగడం జరిగింది.

ఈరోజు చంద్ర సాగర్ నుండి సాగునీటిని సంబంధిత ఇరిగేషన్ శాఖ , స్థానిక ప్రజాప్రతితులు కలిసి అధికారులతో నీటిని విడుదల చేసి చంద్రసాగర్ కాలువలకు కొన్ని చోట్ల మరమతులు చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ అధికారులు సిద్ధం చేస్తాం.
త్వరలో ఇరిగేషన్ శాఖ మంత్రి తో మాట్లాడి నిధులు కేటాయించి కాల్వలను కూడా మరమ్మత్తు చేయడం జరుగుతుంది… శ్రీశైలం ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ చంద్ర సాగర్ ను పర్యాటక ప్రాంతంగా మార్చాదానికి కృషి చేస్తున్నాం.. చంద్ర సాగర్ లో గత కొన్ని రోజుల క్రితం చేప పిల్లలను విడుదల చేయడం జరిగింది దీని ద్వారా మత్స్యకారులు సొసైటీలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది..త్వరలోనే అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీటి ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది.