అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రజిత భర్త అంతటి మల్లేష్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను

MLA డా చిక్కుడు వంశీకృష్ణ ఈ రోజు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో అధికారులపై మరియు చైర్మన్ భర్త మల్లేష్ మరియు డైరెక్టర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గువ్వల బాలరాజ్* రైతుల ముసుగులో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గతంలో లాగా తన గుండాయిచాన్ని రౌడీయిజాన్ని మళ్లీ అచ్చంపేటలో తన అనుచరులతో ప్రదర్శిస్తున్నాడు ఇలాంటి దాడులు కొనసాగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది.

నిజంగానే రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే న్యాయబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంటుంది కావాలని కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతుల ముసుగులో ఉండి ఈ దాడి చేయడం జరిగింది ఈ దాడి చేసిన వారిని వారికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ రోజు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో అన్ని మార్కెట్ లో కన్నా ఎక్కువనే రేటు ఉన్నది.

రైతులకు వాస్తవానికి నిజంగానే మద్దతు ధర లేకపోతే సంబంధిత మార్కెట్ అధికారులకు మరియు గౌరవ ఎమ్మెల్యే నా దృష్టికి తీసుకువచ్చిన సంబంధిత అధికారులతో మాట్లాడి రేటు ఎక్కువ పెట్టించే విధంగా కృషి చేయడం జరుగుతుంది అలా కాకుండా కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మార్కెట్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ఇది చాలా సిగ్గుచేటు ఇటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఈయొక్క ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సంబంధిత పోలీస్ శాఖ వారిని ఆదేశించడం జరుగుతుంది. ఈ సంఘటన ను సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి మాట్లాడడం జరిగింది వారు కూడా విచారం వ్యక్తం చేశారు ఈ దాడిలో పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖ వారిని కోరుతున్నాం.