అటవీ అమరవీరులకు ఘన నివాళులర్పించినఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.

అచ్చంపేట ఫారెస్ట్ ఆఫీస్ ఆఫీస్ ఆవరణంలో ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు డీఎఫ్ఓ రోహిత్ గోపిడి ఇతర ఫారెస్ట్ అధికారులు , అమరుల కుటుంబ సభ్యులు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కు జీవవైవిద్యానికి నిలయమైన అడవులను వాటిలోని వన్యప్రాణులను రక్షించే క్రమంలో ప్రాణాలర్పించిన అటవీ అమరవీరులందరికి జోహార్లు అర్పిస్తూన్నాం.అటవీ వీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు,ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.