అధైర్య పడవద్దు ఆదుకుంటాం

షార్ట్ సర్క్యూట్ తో జీవనోపాధిగా ఉన్న లేడీస్ కార్నర్ పూర్తిగా కాలిపోయి సర్వం కోల్పోయిన కుటుంబానికి తాను అండగా నిలబడతానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారుమూడేళ్ల క్రితం భర్త మరణించడంతో కొల్లాపూర్ పట్టణం నుంచి వనపర్తి పట్టణానికి వచ్చి వల్లబ్ నగర్ పాత ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో లేడీస్ కార్నర్ను ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న కుటుంబం ఒక్కసారిగా సర్వం కోల్పోయింది.శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో లేడీస్ కార్నర్ కాలి బూడిదైపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి అండగా నిలబడ్డారు._*శనివారం ఆయన సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.*__*సంఘటన స్థలం నుంచి అధికారులతో మాట్లాడి ప్రభుత్వం పరంగా అన్ని సహాయ సహకారాలను ఆ కుటుంబానికి అందించాలని ఆయన ఆదేశించారు*_కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ జీవనో పది కోల్పోయామని అధైర్య పడొ ద్దని కుటుంబానికి కావలసిన సహకారాన్ని అందిస్తూ పిల్లల చదువులకు కావలసిన ఖర్చులన్నీ తాను చూసుకుంటానని వారికి హామీ ఇచ్చారుకార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు