అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే గ్రామ సభలు :- తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, రేషన్ కార్డుల పంపిణీ తదితర కార్యక్రమాలను ఈనెల 26వ తేదీ నుంచి అందించడమే లక్ష్యంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు.
చారకొండ మండల కేంద్రంలో ప్రజా పాలన గ్రామసభ లో ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. వాటిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది… గ్రామ సభ ద్వారా గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అర్హులైన వారందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు లబ్ధిదారులు పాల్గొన్నారు.