ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ద్యాప నిఖిల్ రెడ్డి గారు

ఊర్కొండ: ఆంధ్రప్రభ 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ను మంగళవారం రోజు ఊర్కొండ మండల కేంద్రంలో మాదారం మాజీ సర్పంచ్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికలు అనేవి సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉండాలని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పత్రికలు ఉండాలని పేర్కొన్నారు. సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర ముఖ్యమైనదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, కాంగ్రెస్ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయూబ్ పాషా, వహిదోద్దీన్, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, జడ్చర్ల అసెంబ్లీయువజన ప్రధాన కార్యదర్శి మాసుమ్, యువనాయకులు మధు రెడ్డి, కొండల్,కంఠం రాములు, ఊర్కొండ ఆంధ్ర ప్రభ రిపోర్టర్ ఆరెడ్ల అశోక్ రెడ్డి పాల్గొన్నారు.