చారకొండ మండలానికి చెందిన గోరేటి శివ గారి తల్లి లక్ష్మమ్మ గారు గత కొన్ని నెలలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ప్రైవేటు హాస్పిటల్ కి వెళ్లి ఆపరేషన్ చేయించుకోలేని స్థితిలో ఉన్నారు. నా దృష్టికి రావడం వలన అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో రెండవసారి మెగా సర్జికల్ క్యాంపును నిర్వహిస్తున్నందున ఈరోజు అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో విజయవంతంగా ఆపరేషన్ చేసి క్రిటికల్ కేర్ లో ఉన్నటువంటి కంతి ని తొలగించడం జరిగింది.
పేద , మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేసుకోలేని వారు … వెంటనే అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో సంప్రదించి చికిత్స పొందాలని ఇక్కడ చేసేటటువంటి అరుదైన వైద్య సేవ ఏ కార్పొరేట్ హాస్పిటల్ లో నైనా ఆపరేషన్ చేస్తే లక్షల, వేల అయ్యే ఖర్చును మన అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో మెగా సర్జికల్ క్యాంపులో ఉచితంగా ఈ యొక్క ఆపరేషన్లను చేయడం జరుగుతుంది కాబట్టి అచ్చంపేట పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క మెగా సర్జికల్ క్యాంపును ఉపయోగించుకోగలరు.