ఉపాధ్యాయ దినోత్సవ న్ని పురస్కరించుకొని అచ్చంపేట పట్టణంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన మహోత్సవం కార్యక్రమం

భావితరాలకు ఉపాధ్యాయులే ఆదర్శం భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుంది ఉన్నతమైన విద్యార్థిగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయుడు అహర్నిశలు కృషి చేస్తానన్నారు.విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా విద్యాబుద్ధులు నేర్పాలన్నారు మన దేశం నుంచి ఎంతోమందిని విదేశాల్లో ఉన్నత విద్య స్థానంలో నిలిపారంటే అది కేవలం ఉపాధ్యాయుల కృషి వల్లే సాధ్యమైంది.విద్యార్థులందరికీ ఉపాధ్యాయులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి విద్యాబుద్ధులు సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులను విడమర్చి చెబుతూ వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి అనేకమైంది .ప్రభుత్వ పాఠశాలను బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు స్థానికంగా ఉంటూ విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలి.

తమ ప్రభుత్వం కూడా ప్రజా పాలన లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ అన్ని రకాలుగా వసతులు సమకూర్చడంలో ప్రభుత్వం కృషి చేస్తుంది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు ఎంఈఓ లు జిహెచ్ఎంలు నోడల్ ఆఫీసర్లు హెచ్ఎంలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.