ఉమ్మడి మహబూబ్ నాగర్ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని వనపర్తి నియోజకవర్గంలోని పలు నీటి పారుదల అంశాలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
ఈ సందర్భంగా కల్వకుర్తి ఎత్తిపోతల కుడి ఎడమల కాలువకు సంబంధించి చిన్న చిన్న రిపేర్సు బాగుచేస్తే అదనంగా మరో 20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలని మంత్రి గారిని కోరడం జరిగింది.
అలాగే బుద్ధారం చెరువును రిజర్వాయర్ గా మార్చేందుకు చేపట్టిన భూ సేకరణను త్వరగా పూర్తిచేయాలని
బుద్ధారం కెనాల్‌కు లింకు కెనాల్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో సాగునీటి సమస్య ఉండదని తెలియజేయడం జరిగింది.
కర్నెతండా లిఫ్ట్ 90% పూర్తయిందని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న విద్యుత్ ఉపకేంద్రం కోసం నిధులు కేటాయిస్తే అది ఉపయోగంలోనికి వస్తుందని
కల్వకుర్తి ఎత్తిపోతల D8,D2 కెనాన్లకు చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గారికి వివరించడం జరిగింది.
అలాగే వనపర్తి నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ నిధులను వెంటనే మంజూరు చేసి రైతన్నల ఇబ్బందులు తొలగించాలని మంత్రి గారికి తెలియజేయడం జరిగింది
