ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లా కడుకుంట్ల ,పెద్దగూడెం పలు గ్రామాలలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి ,గారితో కలసి ప్రచారం చేయడం జరిగింది
ప్రచారంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 25 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిపించారు అలాగే రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేసే సంక్షేమ పథకాలకు శ్రీకరం చుట్టాం బడుగు బలహీన వర్గాలకు సమస్యలు, సంక్షేమాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతాయి దేశంలో మోడీ చేసింది ఏమీ లేదు అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేస్తున్నాడు.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వడం జరిగింది. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే భారతదేశం ప్రపంచ పటంలోనే టాప్ జాబితాలో చేరుతుంది. కావున ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పై ఓటు వేసి గెలిపించగలరు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి , మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మండల పార్టీ నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.