ఎంపీ ఎన్నికల ప్రచారకార్యక్రమం

శ్రీరంగాపురం, కంబళాపురం,తాటిపాముల, షేరుపల్లి,గ్రామాల్లో ఎంపీ ఎన్నికల ప్రచార కార్యక్రమని నిర్వహించి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి గారుతో కలసి పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు.

పార్టీ నాయకులు, అభిమానులు వారికి డప్పులు వాయిస్తూ, బాణాసంచా పేలుస్తూ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పదేళ్ల పాలనలో అభివృద్ధి కన్నా, అవినీతి బాగా జరిగిందని అందుకే ప్రజలు, కాంగ్రెస్ పార్టీ, కారును షెడ్కు పంపించారని ఎమ్మేల్యే గారు అన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామిని తప్పకుండా అమలు చేస్తామన్నారు.

వీటితోపాటు శ్రీరంగాపురంలోని ప్రసిద్ధిగాంచిన రంగనాథాలయ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న అతిథిగృహాన్ని అభివృద్ధి చేస్తామని, పర్యాటకులకు, భక్తులకు వినోదాన్నిచ్చే బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.

వీటికి అభివృద్ధి సంబంధించిన నిధులు మంజూరైనవని, ఎన్నికల నియమావళీ పూర్తయిన తరువాత పనులు ప్రారంభిస్తామన్నారు.

నూతన మండలంగా ఏర్పడి ఎనమిదేళ్ల అవుతున్న, నేటికి ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. త్వరలోనే ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయిస్తామన్నారు.

కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తె మరింత అభివృద్ధి జరుగుతుంది కావున

హస్తం గుర్తుపై ఓటేసి అధిక మోజార్టీతో గెలిపించాలని వారు కోరారు.