పెబ్బేరు మండలం కంచిరావు పల్లి, గుమ్మడం గ్రామలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ BRS పాలనలో గ్రామంలో అభివృద్ధి జరగలేదని, కేవలం పాలకులు వారి స్వలాభం కోసం అభివృద్ధి మంత్రం జపించారే తప్ప గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.పూర్తిస్థాయిలో గ్రామాల్లో అభివృద్ధి జరిగి ఉంటే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి వేల సంఖ్యలో దరఖాస్తులు ఎందుకు వస్తాయి అని ఆయన ప్రశ్నించాడు.నేడు ఇందిరమ్మ రాజ్యంలో గడపగడపకు ప్రభుత్వ పథకాలు అందుతాయని ప్రభుత్వ పథకాల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు సుజాత తేజ వర్ధన్, వనపర్తి ఎంపీపీ కిచ్చా రెడ్డి, గ్రామ ఎంపీటీసీ రాధా, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్,గ్రామం ఉప సర్పంచ్ భాస్కర్, మాజీ జెడ్పిటిసి సభ్యులు శోభ రాందేవ్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.